News January 22, 2025

BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి

image

తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.

Similar News

News January 23, 2025

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే..

image

2025 గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160మందితో కూడిన కవాతు, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందాలు భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనున్నాయి. 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరైన విషయం తెలిసిందే.

News January 23, 2025

రూ.173కు కొని.. రూ.43 కోట్లకు అమ్మాడు!

image

ఇంట్లో పాత వస్తువులుంటే మనం చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆ పాత వస్తువు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. పాత వస్తువులను కలెక్ట్ చేసే అలవాటున్న ఓ వ్యక్తి 2010లో ఓ షాపుకెళ్లి $2 (రూ. 173) చెల్లించి పాత ఫొటోను కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అమెరికన్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందినవారని తెలుసుకున్నాడు. ఈక్రమంలో 2014లో దీనిని వేలం వేసి $5 మిలియన్లకు(రూ.43కోట్లు) విక్రయించాడు.

News January 23, 2025

ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం: చంద్రబాబు

image

CMలుగా వేర్వేరు పార్టీలకు చెందినా ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని AP CM <<15229916>>చంద్రబాబు<<>> అన్నారు. ‘కలిసి పనిచేస్తే వికసిత భారత్ సాధ్యమే. వ్యవసాయం, మానవాభివృద్ధిలో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో AP కృషి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 165గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నాం’ అని దావోస్‌లో చంద్రబాబు తెలిపారు.