News March 18, 2024
నేటి నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట నిర్వహించాలంటూ తాజాగా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి మే 31 వరకు అమలుచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వీటిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికీ తిరిగి పిల్లల ప్రీ స్కూల్ రీ-అడ్మిషన్, బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుంది.
Similar News
News February 4, 2026
మహబూబ్‌నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News February 4, 2026
పాలమూరు బరిలో స్వతంత్రుల జోరు!

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 60 డివిజన్లకు గాను మొత్తం 347 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఏకంగా 127 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉండటం విశేషం. పార్టీల వారీగా కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 58, బీజేపీ 52 స్థానాల్లో పోటీలో ఉండగా.. ఎంఐఎం, జనసేన, బీఎస్పీ కూడా బరిలో ఉన్నాయి. స్వతంత్రుల పోటీ పెరగడంతో ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది.