News March 18, 2024
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

ఇటీవల ఈసీ బయటపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన రూ.4,002 కోట్ల విలువైన బాండ్ల వివరాలను వెల్లడించేలా SBIని ఆదేశించాలని సిటిజన్స్ ఫర్ రైట్స్ ట్రస్టు కోరింది. కాగా 2019 APR 12 నుంచి 2024 FEB 15 వరకు అమ్మిన బాండ్ల వివరాలు సుప్రీం ఆదేశాలతో బహిర్గతమైన విషయం తెలిసిందే.
Similar News
News March 31, 2025
నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: దర్శకుడి తల్లి ఆవేదన

‘L2:ఎంపురాన్’ మూవీలోని సన్నివేశాలు వివాదానికి దారి తీయడంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. ఈ సినిమా విషయంలో పృథ్వీరాజ్‌ను అనవసరంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ ఎవ్వరినీ మోసం చేయలేదని, చేయబోరని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో తప్పులుంటే అందరి బాధ్యత ఉంటుందన్నారు.
News March 31, 2025
ఆదిలాబాద్ గిరిజన మహిళలకు PM ప్రశంస

TG: ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వాళ్లు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూల గురించి మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. మహిళలు కొత్త ప్రయోగం చేశారని అభినందించారు. కాగా అటవీ ప్రాంతాల్లో దొరికే ఇప్పపువ్వుతో గతంలో నాటుసారా తయారుచేసేవారు. అయితే ఉట్నూరుకు చెందిన కొందరు మహిళలు ఇప్పపువ్వుతో పోషక విలువలు కలిగిన లడ్డూలను తయారుచేస్తూ, గిరిజన పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.
News March 31, 2025
BREAKING: రేపు సెలవు ప్రకటన

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.