News January 23, 2025
అందరూ ఆధ్యాత్మికతను అలవార్చుకోవాలి: ASF MLA

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవార్చుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని సావర్‌ఖేడ గ్రామంలో నిర్వహించిన ఆధ్యాత్మిక గురువు పులాజీబాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంతకుముందు బాబా చిత్రపటానికి, గ్రంథాలకు పూజలు చేశారు. బాబా చెప్పిన భోధనలు అందరికీ ఆచరణీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బాబా భక్తులు తదితరులున్నారు.
Similar News
News July 6, 2025
వ్యాసాశ్రమంలో దశాబ్దాల తర్వాత కలిశారు..!

ఏర్పేడు(M) వ్యాసాశ్రమంలో శ్రీమలయాళస్వామి ఆరాధనోత్సవం జరిగింది. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. 1965 నుంచి 2000వ సంవత్సరం వరకు చదవిన దాదాపు 150 మంది రావడంతో అందరిలోనూ సంతోషం నెలకొంది. ఇక్కడ చదివిన తామంతా ఉన్నతస్థాయికి చేరామని, ఇదంతా మలయాళస్వామి కృపేనని పేర్కొన్నారు. ఏర్పేడులో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మీరూ వ్యాసాశ్రమంలో చదివారా? బ్యాచ్ పేరుతో కామెంట్ చేయండి.
News July 6, 2025
రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన

వరంగల్ రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు జురాసిక్ వరల్డ్ 3D సినిమా నడుస్తున్న క్రమంలో, త్రీడీ బొమ్మ కనిపించకపోవడంపై ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహించారు. షో నిలిపి వేసి టికెట్ డబ్బులు ఇచ్చి పంపించారు.
News July 6, 2025
పెద్దమందడిలో 12.8 మి.మీ వర్షపాతం

జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) పెద్దమందడిలో అత్యధికంగా 12.8 మి.మీ వర్షం కురిసింది. అమరచింత 10.2 మదనాపూర్ 6.2 ఘనపూర్ 1.4 గోపాల్పేట్ 1.6 రేవల్లి 7.6 పానగల్ 4.4 వనపర్తి 1.2 కొత్తకోట 2.6 ఆత్మకూరు 1.6 శ్రీరంగాపూర్ 3.0 వీపనగండ్ల 2.8 చిన్నంబావి లలో 1.8 మి.మీ వర్షపాతం, పెబ్బేర్‌లో ‘0’మి.మీ వర్షపాతం నమోదయినట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు.