News January 23, 2025

MBNR: విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

image

విద్యార్థి అదృశ్యమైన సంఘటన నవాబుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ విక్రం వివరాల ప్రకారం.. నవాబుపేట మండలంలోని లోకిరేవు గ్రామానికి చెందిన గౌతమ్ 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 19వ తేదీన భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో మేనత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. వెళ్లలేదు. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News January 23, 2026

VJA: ఉద్యోగం పేరిట రూ.12 లక్షల టోకరా.. నిందితుల అరెస్ట్!

image

ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్న అంతర్ జిల్లా మోసగాళ్ల ముఠాను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. రోలుగుంటకి చెందిన ఓ మహిళకు DSCలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, ప్రకాశం(D)కు చెందిన శ్రీను, VJAకు చెందిన షేక్ సలీం అనే వ్యక్తులు ఆమె వద్ద నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

News January 23, 2026

RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

image

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.

News January 23, 2026

మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

image

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.