News January 23, 2025
HYD: సెక్రటేరియేట్‌కు వెళ్లే టూరిస్టులపై ఆంక్షలు
సచివాలయంకు వచ్చే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై సచివాలయం లోపలకి వెళ్లేవారికి ఇచ్చే పాసుతో ఒక్కరిని మాత్రమే అనుమతినిస్తామని తెలిపింది. సీఎస్ ఫ్లోర్లో సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతోపాటు.. సందర్శకుల సంఖ్యను తగ్గించాలని SPF సిబ్బంది కోరడంతో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 23, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT
News January 22, 2025
HYD: మాజీ ఎమ్మెల్యేపై కేసు.. KTR రియాక్షన్
దాడిచేసింది గాక తిరిగి మాజీ ఎమ్మెల్యేపైనే కేసు పెట్టారు, ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన రసాభాసలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదన్నారు.
News January 22, 2025
VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో
సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్‌లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.