News January 23, 2025
దావోస్‌లో అందరం ఒక్కటే: సీఎం చంద్రబాబు
చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని AP సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్‌లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని దావోస్ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అన్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.
Similar News
News January 23, 2025
తెలంగాణలో JSW రూ.800 కోట్ల పెట్టుబడులు
TGలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు JSW సంస్థ దావోస్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. USకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
News January 23, 2025
కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరిక
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు విన్నవించాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఫీజు బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని కోరాయి.
News January 23, 2025
నూతన DGP ఈయనేనా?
AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.