News January 23, 2025

కామారెడ్డి: రక్త దానం@57 సార్లు

image

అత్యవసర సమయంలో రోగికి రక్తదానం చేసి ఉదారతను చాటుకున్నారు జీడిపల్లి శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ బాలిక అనీమియా వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు రక్తం అవసరం కాగా.. శ్రీనివాస్ రెడ్డి రక్తం దానం చేసి ఆమెకు అండగా నిలిచారు. ఇప్పటి వరకు ఆయన 57 సార్లు రక్తం దానం చేశారు.

Similar News

News January 7, 2026

నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

image

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.

News January 7, 2026

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

image

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

News January 7, 2026

దూబచర్లలో విషాదం.. బైకును ఢీకొట్టి పరార్

image

నల్లజర్ల మండలం దూబచర్లలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బైకిస్టు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.