News March 18, 2024
నెల్లూరు: నేటి పోలీస్ స్పందన రద్దు

ప్రతి సోమవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు విషయాన్ని గుర్తించి.. సహకరించాలని కోరారు.
Similar News
News March 11, 2026
రైల్వే బిట్రగుంట గురించి మీకు తెలుసా…?

రైల్వే బిట్రగుంట చాలామందికి తెలుసు. దేశంలోనే పేరు పొందిన లోకో షెడ్ ఇక్కడుండేది. వేలాది మంది కార్మికులు పనిచేసేవారు. దీన్నే లిటిల్ ఇంగ్లాండనేవారు. రైల్వే కంటోన్మెంటనీ పిలిచేవారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల రాకతో లోకో షెడ్ అవసరం తీరింది. సహజంగానే మూతపడింది. రైల్వే షెడ్‌తో ప్రఖ్యాతి పొందిన రైల్వే బిట్రగుంట ఇప్పుడు అజ్ఞాతంగా ఉంది. వందల కోట్లు ఆస్తులు ఉన్నా.. ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తోంది.
News March 11, 2026
నెల్లూరులో 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా

నెల్లూరు జిల్లాలో పంచాయతీలకు గ్రేడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాటిలో జనాభా ప్రాతిపదికన 13 పంచాయతీలకు ‘రూర్బన్’ హోదా లభించింది. అల్లూరు, బోగోలు, కోట, కోవూరులో 2 పంచాయతీలు, ముత్తుకూరులో 2 పంచాయతీలు, పొదలకూరు, రాపూరు, సంగం, ఉదయగిరి, వింజమూరు, కలువాయి పంచాయతీలు ఉన్నాయి. ఇక మీదట ఈ పంచాయతీల్లో మున్సిపాలిటీ తరహాలోనే పాలన కొనసాగనుంది.
News March 11, 2026
నెల్లూరు: వెటర్నరీ క్యాంపులు ఎప్పుడో..!

నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల కిందట వెటర్నరీ క్యాంపులు ఆగిపోయాయి. జిల్లాలో 8 మార్కెటింగ్ కమిటీల పరిధిలో రెండేసి చొప్పున 16 క్యాంపులు చేపట్టాలి. ఒక్కో క్యాంపునకు రూ.25 వేలు చొప్పున మార్కెటింగ్ శాఖ ఖర్చు చేస్తున్నా.. వెటర్నరీ అధికారులు తేదీలు ఖరారు చేయడం లేదు. ఇవి జరిగితే పశువులు, మేకలు, గొర్రెలకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. నెలాఖరు లోపు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లనున్నాయి.


