News January 23, 2025

 పేర్లు రానివారు దరఖాస్తు సమర్పించాలి: ASF కలెక్టర్

image

ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల అమల్లో భాగంగా గ్రామసభలలో చదివే జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2026

HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్‌ వాడొద్దు

image

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్‌-కిడ్‌’ సిరప్‌ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.

News January 10, 2026

సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

image

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌లా ఉండాలంటున్నారు.

News January 10, 2026

కాకాణి, సోమిరెడ్డి మధ్య ఇరిగేషన్ వార్ !

image

నువ్వు దోచుకున్నావంటే.. నువ్వే ఎక్కువ దోచుకున్నావంటూ పరస్పరం కాకాణి, సోమిరెడ్డి విమర్శించుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇరిగేషన్ పనుల అవినీతే లేవనెత్తుతున్నారు. కనుపూరు కాలువ, కండలేరు స్పిల్ వే, సర్వేపల్లి కాలువ, చెరువు షట్టర్ పనులపై విమర్శించుకుంటున్నారు తప్పితే.. ప్రజలు కష్టాలను గాలికొదిలేస్తున్నారన్నా అపవాదు నెలకొంది.