News January 23, 2025

నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా అంబులెన్స్ సహకారంతో రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామనికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

Similar News

News November 7, 2025

సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌లో 49 ఉద్యోగాలు

image

<>మినిస్ట్రీ<<>> ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌ 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ 60శాతం మార్కులతో పాసైనవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://socialjustice.gov.in

News November 7, 2025

సిద్దిపేట: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

image

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈక్రమంలో చేర్యాల(M) ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCMఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.

News November 7, 2025

HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్‌లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.