News January 23, 2025
బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్ పాండ్య

T20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్, బుమ్రాను హార్దిక్ పాండ్య దాటేశారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి T20లో 2 వికెట్లు తీసిన హార్దిక్ తన ఖాతాలో 91 వికెట్లు వేసుకున్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్‌కు 90, బుమ్రాకు 89 వికెట్లు ఉన్నాయి. అటు ఇండియా తరఫున T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో చాహల్‌ను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు.
Similar News
News November 4, 2025
న్యూస్ అప్‌డేట్స్

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం
News November 4, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<
News November 4, 2025
క్లాసెన్‌ను రిలీజ్ చేయనున్న SRH?

IPL: వచ్చే నెలలో జరిగే మినీ ఆక్షన్‌కు ముందు స్టార్ బ్యాటర్ క్లాసెన్‌ను SRH రిలీజ్ చేసే అవకాశం ఉందని ToI పేర్కొంది. ఇతడి కోసం పలు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని తెలిపింది. గత మెగా వేలానికి ముందు రూ.23 కోట్లతో క్లాసెన్‌ను ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది. అతడిని రిలీజ్ చేస్తే వచ్చే డబ్బుతో మంచి బౌలింగ్ అటాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో జట్టును బ్యాలెన్స్ చేసుకోవచ్చని SRH భావిస్తున్నట్లు సమాచారం.


