News January 23, 2025
ఎన్టీఆర్: APCRDAలో 8 పోస్టుల భర్తీ

CRDAలో డిప్యూటేషన్ విధానంలో 8 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. FEB 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడాలని విజయవాడలోని CRDA కార్యాలయం నుంచి తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News January 1, 2026
కృష్ణా జిల్లాలో మహిళలపై నేరాలకు బ్రేక్

కృష్ణా జిల్లాలో మహిళల భద్రత దిశగా సానుకూల మార్పు కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. పోక్సో కేసులు 133 నుంచి 77కి తగ్గి 42 శాతం తగ్గుదల నమోదు కాగా, మహిళలపై మొత్తం నేరాలు 914 నుంచి 669కి చేరి 27 శాతం తగ్గాయి. పోలీసుల కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
News January 1, 2026
మాదకద్రవ్యాలపై కృష్ణా జిల్లా పోలీసుల ఉక్కుపాదం

ఎన్‌డీపీఎస్ చట్టం కింద మాదకద్రవ్యాల నియంత్రణలో కృష్ణా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 2024లో 428.833 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, 2025లో 475.261 కిలోల గంజాయి, 1 గ్రాము కోకైన్, 116 గ్రాముల సిరప్‌తో పాటు ఒక గంజాయి మొక్కను పట్టుకున్నారు. మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్టైన వారి సంఖ్య 133 నుంచి 150కి పెరిగింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
News December 31, 2025
కృష్ణా జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ కేకులకు భారీ గిరాకీ

జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు ముందే పట్టణాలు, గ్రామాల్లో న్యూ ఇయర్ కేకులకు మంచి గిరాకీ ఏర్పడింది. బేకరీలు, స్వీట్ షాపులు, పళ్ల దుకాణాలు, పూల దుకాణాల వ్యాపారులు ఉదయం నుంచే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసుకుని విక్రయాలకు సిద్ధమయ్యారు. వివిధ రకాల డిజైన్లతో, విభిన్న రుచుల్లో న్యూ ఇయర్ కేకులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో గృహావసరాల కోసం పండ్లు, పూల కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి.


