News March 18, 2024

యాదగిరిగుట్ట: ఒకేరోజు అత్తాకోడలు మృతి

image

అత్త మృతిని తట్టుకోలేక కోడలు గుండెపోటుతో కుప్పకూలింది. యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెకి చెందిన చుక్కల భారతమ్మ(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) రోదిస్తూనే పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేరోజు అత్తాకోడళ్ల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News April 4, 2025

NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

image

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.

News April 4, 2025

NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

image

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

News April 4, 2025

NLG: జిల్లాలో మామిడికి గడ్డు పరిస్థితులు!

image

ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి ఈ ఏడాది గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురియక, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత సకాలంలో రాలేదు. వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దట్టంగా కురిసిన పొగమంచు పూతను దెబ్బతీసిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1 నుంచి 2 టన్నుల వరకైనా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.

error: Content is protected !!