News January 23, 2025

నూతన DGP ఈయనేనా?

image

AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 23, 2025

BIG NEWS.. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం <<15232469>>ఒప్పందం <<>>కుదుర్చుకుంది.

News January 23, 2025

ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!

image

విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.

News January 23, 2025

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ

image

హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.