News January 23, 2025
కరీంనగర్: స్పౌజ్ కేటగిరికి దరఖాస్తులు

స్పౌజ్ బదిలీలకు సంబంధించి ముందడుగు పడింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్‌కు 143 మంది టీచర్స్ రానున్నారు. ఈ మేరకు వారు డీఈవో ఆఫీసులో రిపోర్ట్ చేశారు. వారికి త్వరలో కౌన్సెలింగ్ జరగనుంది. వీరంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట నుంచి బదిలీపై రానున్నారు.
Similar News
News November 4, 2025
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సి.సి.ఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు తేమలేని పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు.
News November 4, 2025
కరీంనగర్: మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం: సీపీ గౌస్ఆలం

మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కరీంనగర్ సీపీ గౌస్ఆలం తెలిపారు. అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈక్రమంలో 70 ప్రాంతాల్లో నిఘా పెట్టి, 30 మంది పోకిరీలను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. ఫిర్యాదుల మేరకు 13 మంది వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 3, 2025
మానకొండూరు: పాఠశాల దారి మూసేశారు..!

మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.


