News January 23, 2025

కడప సెంట్రల్ జైలు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కడప శివార్లలోని సెంట్రల్ జైలు సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందారని నిర్ధారించారు. రామాంజనేయపురం పరిధిలోని శ్రీరామనగర్‌కు చెందిన పడిగ ప్రవీణ్, వి. సుభాశ్‌లుగా గుర్తించారు.

Similar News

News January 8, 2026

ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

image

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్‌లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.

News January 8, 2026

గండికోటలో తొలిసారి హెలికాప్టర్ ఎక్కేయండి..!

image

గండికోట ఉత్సవాలు ఈనెల 11, 12, 13న జరగనున్నాయి. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి అందించడానికి గండికోటలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున వసూళ్లు చేస్తారు. కాసేపు గండికోటలో హెలికాప్టర్‌లో తిప్పుతారు. సంబంధిత వాల్‌పోస్టర్లను కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP నేత శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.

News January 8, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు ఇలా..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం గ్రాము: రూ.13920
22 క్యారెట్ల గ్రాము ధర: రూ.12806
*వెండి 10 గ్రాములు: : రూ.2,435