News January 23, 2025
గణతంత్ర పరేడ్‌లో ఏపీ శకటం
ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే 76వ రిపబ్లిక్ డే పరేడ్‌లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి AP, KAలకు అవకాశం దక్కగా, TGకు దక్కలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న AKP(D) ఏటికొప్పాక బొమ్మల శకటానికి స్థానం దక్కింది. అంకుడు కర్రతో చేతితో తయారు చేసే ఈ బొమ్మలకు 2017లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.
Similar News
News January 23, 2025
రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు
TG: దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని భారీ ఒప్పందాలు చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్‌తో రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్‌తో రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. HYDలో ఈ సంస్థ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
News January 23, 2025
IPL: KKRకు బిగ్ షాక్?
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఎంపీ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతూ ఆ జట్టు ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు. కేరళతో జరిగిన మ్యాచులో ఆయన కాలిమడమకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టొచ్చు. కాగా IPL మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి వెంకటేశ్‌ను KKR కొనుగోలు చేసింది. ఈ సీజన్‌కు ఆయనను కెప్టెన్‌గా కూడా నియమిస్తారని వార్తలు వచ్చాయి.
News January 23, 2025
పవన్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశారు.