News January 23, 2025
ADB: తమ్ముడిని అరెస్ట్ చేశామని ఫోన్

ఆదిలాబాద్ 1 టౌన్‌లో సైబర్ క్రైమ్ కేస్ బుధవారం నమోదైంది. సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. తిర్పల్లికి చెందిన అఫ్రోజ్‌ఖాన్‌కు ఈనెల 16న ఓ కాల్ వచ్చింది. మీ తమ్ముడు తబ్రేజ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడని, అతడిని విడిపించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అతడు వెంటనే వారి ఫోన్ నంబర్లకు నగదు బదిలీ చేశాడు. తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 16, 2026
రేపు మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

పాలమూరు జిల్లాకు రేపు సీఎం ఏ.రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని జిల్లా పోలీసులు తెలిపారు. పిస్తా హౌస్ బైపాస్ నుంచి రాయచూర్ రోడ్డు, భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్, పీయూ కాలేజ్ కొత్త బైపాస్ నుంచి పిస్తా హౌస్ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలను పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
HYDలో డ్రోన్ల జాతర.. నేడు హై-వోల్టేజ్ స్కై షో!

గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఎక్స్‌పో 2026 నేడు ప్రారంభం కానుంది. వెయ్యి డ్రోన్లతో ఆకాశంలో ప్రదర్శించే అద్భుత ఆకృతులు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ షోకు ఫ్రీ ఎంట్రీ. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, రేసింగ్‌ను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా సందర్శకులు ముందుగానే రావాలని నిర్వాహకులు సూచించారు. సంక్రాంతి సందడిని టెక్నాలజీతో జరుపుకోండి.


