News January 23, 2025

BNGR: 23 యూనిట్లు మంజూరు: నరసింహారావు

image

దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. 50వేల రూపాయలతో 100% రాయితీతో 23 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. 21 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు అర్హులని పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 18, 2025

మంచిర్యాల: ‘RSS, BJPకి రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం తెలీదు’

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని CPM కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్ట్‌లని అన్నారు. చరిత్రకు మతం రంగు పూసే RSS, BJPకి రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం తెలియదని పేర్కొన్నారు.

News September 18, 2025

నిర్మల్: ఐటీఐ కళాశాలలో కాన్వోకేషన్ డే

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఐటీఐ కళాశాలలో కాన్వోకేషన్ డేని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి శాఖ కన్వీనర్ కోటిరెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐటీఐ ఛైర్మన్ ఆదిత్య, ప్రిన్సిపల్ కృష్ణమూర్తితో కలిసి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్(గెస్ట్ ఆఫ్ హానర్), సెక్రటరీ చంద్రశేఖర్, మేనేజ్‌మెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

News September 18, 2025

విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

image

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.