News January 23, 2025
జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ

జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.
Similar News
News March 23, 2026
SKLM: ‘ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాలు’

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, అమదాలవలస బస్ స్టేషన్లలో ప్రయాణీకులకు RO ప్లాంట్‌ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు.
News March 23, 2026
శ్రీకాకుళం: సదరంలో మరో ఐదు కొత్త వైకల్యాల చేర్పు.. DMHO వెల్లడి

వైకల్య సదరం సర్టిఫికెట్లు జారీలో కొత్తగా ఐదు రకాల వైకల్యాలను జాబితాలో చేర్చినట్లు DMHO అనిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో యాసిడ్ దాడిబాధితులు, స్పీచ్&లాంగ్వేజ్ డిజాస్టర్, అభ్యాసవైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజాస్టర్, బహుళ వైకల్యం ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె అన్నారు. ఈనెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి నిర్ధారణ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
News March 23, 2026
శ్రీకాకుళం: PG సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ రిలీజ్

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ BR అంబేడ్కర్ యూనివర్సిటీ PG ఆర్ట్స్& సైన్స్ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారిని డాక్టర్ యు. కావ్యజోష్ణ ఈ నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు రూ.770, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050లను ఏప్రిల్ 12వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.


