News March 18, 2024
అన్నమయ్య: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. పీటీఎం మండలం చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఏఎస్ఐని 108లో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.
Similar News
News January 25, 2026
కడప ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ శనివారం ప్రకటించారు. కడప జిల్లాలో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు నిర్వహించామన్నారు. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
News January 25, 2026
వైవీయూలో అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

వైవీయు క్యాంపస్ కళాశాల ఇంగ్లిశ్ విభాగంలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 29న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్, నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సందర్శించాలని సూచించారు.
News January 24, 2026
మృతుడి భార్యకు ఉద్యోగం ఇస్తాం: కడప ఎమ్మెల్యే

కడపలో గురువారం నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రలో <<18946125>>మృతి చెందిన హరి<<>> భార్యకు ఉద్యోగంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని MLA మాధవి రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ కడప రిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అయోధ్య ఐక్యవేదిక సభ్యులు, మేయర్ సురేశ్, టీడీపీ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుమారుడి చదువు కోసం సహాయం అందిస్తామని ఐక్యవేదిక సభ్యులు హామీ ఇచ్చారు.


