News January 23, 2025

వరంగల్ మార్కెట్లో పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత మూడు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. సోమవారం రూ.7,220 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,200, బుధవారం రూ.7,210 అయింది. అయితే నేడు ధర భారీగా తగ్గి రూ.7,135కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 1, 2025

మెదక్ జిల్లా ఇందిరాగాంధీని మర్చిపోదు: మంత్రి

image

ఉమ్మడి మెదక్ జిల్లా ఇందిరాగాంధీని ఎప్పటికీ మర్చిపోదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మునిపల్లి మండలం పెద్ద చల్మెడ గ్రామంలో ఆమె చిత్రపటానికి శుక్రవారం సాయంత్రం పూలమాలవేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్ర పరిశ్రమలు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందని చెప్పారు.

News November 1, 2025

సంగారెడ్డి: పరిశ్రమలు భద్రతా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని పరిశ్రమలు భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పరిశ్రమలు సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని చెప్పారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News November 1, 2025

పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

image

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.