News January 23, 2025
లోకేశ్‌కు చిరు విషెస్

ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని చిరు పేర్కొన్నారు.
Similar News
News February 5, 2026
AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.
News February 5, 2026
బంధంలో ఇది ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News February 5, 2026
గొడవలు ఎందుకొస్తాయంటే?

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.


