News January 23, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే మిర్చి ధరలు తగ్గాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.14,600 ధర పలకగా.. నేడు రూ.14,300కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి బుధవారం రూ.15,000 ధర రాగా.. నేడు రూ.13,500కి పతనమైంది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 14, 2025
హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.
News March 14, 2025
సీఎం ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు: మంత్రి పొన్నం

TG: తమ ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా CM ఒక్కరే తీసుకోరని, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై BRS నిరసనకు దిగడం సిగ్గుచేటని అన్నారు. ‘తాము అనుకున్నట్లుగా సభ నడవాలనేది BRS నేతల ఉద్దేశం. అందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారు. స్పీకర్గా దళితుడు ఉన్నారనే అవమానించారు. పొరపాటు అయ్యిందని చెబితే వివాదం ముగిసేది’ అని వ్యాఖ్యానించారు.
News March 14, 2025
మెదక్: పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్(24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణ చేపట్టారు.