News March 18, 2024

ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డుల హిస్టరీ ఇదే!

image

దేశంలోని ఎన్నికల్లో ఓటర్లకు తొలుత కేవలం పేరుతో ఉండే స్లిప్పులు ఇచ్చేవారు. ఫొటో గుర్తింపు కార్డులు ఇవ్వడంపై 1957లో ఆలోచన చేశారు. 1960లో కోల్‌కతా నైరుతి పార్లమెంటరీ ఎన్నికలో ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేయగా, విఫలమైంది. 1979లో సిక్కిం ఎన్నికల్లో, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఐడెంటిటీ కార్డు ప్రవేశపెట్టారు. 1994లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. 1997లో ఓటర్ల జాబితా కంప్యూటరీకరణ మొదలైంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 24, 2024

X ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X తన ప్రీమియం ప్లస్ ఛార్జీలను దాదాపు 40 శాతం పెంచింది. ప్రస్తుతం భారత్‌లో నెలకు ధర రూ.1,300 కాగా ఏటా రూ.13,600గా వసూలు చేస్తోంది. దీన్ని నెలకు రూ.1,750, ఏటా రూ.18,300కు పెంచింది. అయితే 2025 జనవరి 21వ తేదీ కంటే ముందే బిల్లింగ్‌ సైకిల్‌ మొదలైన వారికి పాత ధరలకే ప్రీమియం ప్లస్ సేవలు అందనున్నాయి. ఈ చందాదారులకు పూర్తిగా యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ లభిస్తుంది.

News December 24, 2024

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

image

జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐదేళ్లపాటు లేదా వయసు 70ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, ఉమ్మడి AP హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ CJగా బాధ్యతలు నిర్వహించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.

News December 24, 2024

English Learning: Antonyms

image

✒ Cheap× Dear, unreasonable
✒ Coarse× Fine, Chaste
✒ Classic× Romantic, Unusual
✒ Compact× Loose, Diffuse
✒ Comic× Tragic, tragedian
✒ Conceit× Modesty
✒ Compress× Amplify, Expand
✒ Condemn× Approve, Praise
✒ Concord× Discord