News January 23, 2025
పెద్దపల్లి- రంగాపూర్ ప్రధాన రహదారి వద్ద చెట్టును ఢీకొట్టిన కారు
పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామం వద్ద ప్రధాన రహదారికి అనుకుని ఉన్న చెట్టును కారు ఢీ కొట్టింది. అయితే ప్రమాదం ఎప్పుడూ జరిగింది. అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో తెలియలేదు. కారులో ఉన్న వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు, తలకు గాయాలయయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 23, 2025
అటవీశాఖలో మార్పులపై పవన్ ఫోకస్
AP: అటవీశాఖలో సమూల మార్పులపై Dy.CM పవన్ దృష్టి సారించారు. అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు యాక్షన్ ప్లాన్, అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
News January 23, 2025
UGCముసాయిదా పై చర్చించిన మాజీ ఎంపీ
విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి UGC ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో BRS నేతల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. UGC ముసాయిదా అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు.
News January 23, 2025
రేపు ఉ.10 గంటలకు..
AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఈ నెల 24న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మ.3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈ నెల 27న ఉ.11 గం.కు విడుదల చేయనున్నారు. దళారులను నమ్మవద్దని <