News January 23, 2025

సిద్దిపేట: WOW.. రెండు కళ్లు సరిపోవట్లే !

image

పచ్చని పొలాలు, పల్లెటూరి అందాలు సాధారణంగా ఎవరినైనా కట్టిపడేస్తాయి. అయితే సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్  మండలం అప్పాయిపల్లిలో ఓ దృశ్యం మాత్రం అంతకుమించి ఉంది. వరి నాటు కూలీలు తమ పనిలో నిమగ్నవగా సమీపంలో ఓ రైలు వెళుతున్న సీనరీ చూపరులను కట్టిపడేస్తుంది. వారి ఛాయ నారు మడిలో పడుతుండగా ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్లు సరిపోవు అన్నట్లు ఆ ఫోటో ఉంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Similar News

News September 19, 2025

వర్గల్: పుట్టింటికి వెళ్లిన భార్య కావడం లేదని భర్త సూసైడ్

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్ చేసుకున్న ఘటన వర్గల్ మండలం మాదారంలో జరిగింది. అంకనీ సాయికుమార్(36), శ్యామల దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇరువురు తరచూ గొడవలు పడుతుండటంతో రెండేళ్ల క్రితం శ్యామల పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం భార్యను ఇంటికి రమ్మని వెళ్లగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన సాయి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.

News September 19, 2025

శబరిమల యాత్రకు వెళ్లి..తిరుగొస్తుండగా ఒకరి మృతి

image

సంతమాగులూరు మండలంలోని ఫతేపురం గ్రామానికి చెందిన సాంబయ్య శబరిమల యాత్ర తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 14న తన స్నేహితుడితో కలిసి శబరిమలకు వెళ్లాడు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి రైలులో స్వగ్రామం బయలుదేరాడు. తమిళనాడు రాష్ట్రంలో గుండెపోటు రావడంతో రైల్వే సిబ్బంది ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు చెప్పారు. దీంతో పత్తేపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 19, 2025

‘కలెక్టరేట్లో’ ప్రత్యేక గ్రీవెన్స్.. 27 అర్జీలు స్వీకరణ

image

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు మొత్తం 27 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ హనుమంతరావు వీటిని స్వీకరించారు. రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్, రైతులకు భూమి కేటాయించాలని రామన్నపేట తహశీల్దార్‌ను ఫోన్‌లో ఆదేశించారు.