News January 23, 2025
ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!
విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.
Similar News
News January 24, 2025
స్వియాటెక్‌కు షాక్.. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్
టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. రెండో సీడ్ స్వియాటెక్‌కు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కేస్ షాకిచ్చారు. సెమీఫైనల్ మ్యాచులో 5-7, 6-1, 7-6 తేడాతో కేస్ గెలుపొందారు. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో సబలంక 6-4, 6-2 తేడాతో బడోసాపై విజయం సాధించారు. ఎల్లుండి జరిగే ఫైనల్లో కేస్, సబలంక తలపడనున్నారు. మరోవైపు రేపు మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో జకోవిచ్ రెండో సీడ్ జ్వెరెవ్‌తో అమీ తుమీ తేల్చుకోనున్నారు.
News January 24, 2025
పొట్ట తగ్గాలంటే ఇలా చేయండి!
ప్రస్తుత జీవనశైలితో పెద్ద, చిన్న అన్న తేడా లేకుండా చాలా మందికి పొట్ట వస్తోంది. ఈక్రమంలో పొట్ట ఎలా తగ్గించుకోవాలో వైద్యులు సూచించారు. ‘దీనికోసం రోజూ 2 సార్లు (ఉదయం, రాత్రి) తినాలి. 3 నెలలైనా తగ్గకపోతే.. రోజుకు ఒకసారే తినాలి. మిగతా టైమ్‌లో వాటర్ తాగుతుంటే పొట్ట తగ్గుతుంది. వాటర్‌తోనే ఉండలేమనుకుంటే.. బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ షుగర్ లేకుండా తాగండి’ అని చెప్పారు.
News January 23, 2025
చైనా ప్లస్ వన్ పాలసీ అంటే ఇదే..
తాము చైనా ప్లస్ వన్‌తో పోటీపడుతున్నామని TG సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో చెప్పారు. అంటే ఒక దేశానికి చెందిన కంపెనీ చైనాలోనే కాకుండా భారత్, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించడం. ఒకప్పుడు చైనాలో తక్కువ ధరకే లేబర్లు దొరికేవారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా కంటే తక్కువ ధరకు సౌత్ ఈస్ట్ దేశాల్లో లేబర్ దొరుకుతుండటంతో ఈ పాలసీ ఫేమస్ అవుతోంది.