News January 23, 2025
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

AP: అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతడు క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చరణ్ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన చరణ్ ఇంతలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Similar News
News January 8, 2026
బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.
News January 8, 2026
ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.
News January 8, 2026
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<


