News January 23, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు డీఈవో హెచ్చరిక

ఉపాధ్యాయులు పాఠశాలల సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం హెచ్చరించారు. కొందరు ఉపాధ్యాయులు ఆలస్యంగా పాఠశాలకు వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమయపాలనపై పరిశీలన చేయాలని సూచించారు. పాఠశాల సమయాల్లో బయటకు వెళ్లొద్దని చెప్పారు.
Similar News
News January 13, 2026
KNR: పేపర్ లీక్.. 30 మంది ఏఈఓల సస్పెండ్

అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడి దొరికిపోయిన 30 మంది ఇన్ సర్వీస్ ఏఈఓలను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి లీకేజీకి కారణమైన 30 మందితోపాటు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 8 మంది, సిరిసిల్లలో ముగ్గురు, మిగతా వారు వరంగల్, అశ్వారావు పేట, రాజేంద్రనగర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
News January 13, 2026
కళకళలాడనున్న చార్మినార్ పరిసరాలు

HYD అనగానే అందరికీ చార్మినార్ గుర్తొస్తుంది. సిటీకి ఐకాన్‌గా నిలిచిన దీని పరిసరాలపై కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) అధికారులు దృష్టిపెట్టారు. చూట్టూ వెలుగులు విరజిమ్మేలా LED లైటింగ్ ఏర్పాటుకు RFP టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 27 వరకు గడువు విధించారు. ఈ పనులు పూర్తైతే పాతబస్తీ జిగేల్‌మంటూ మెరిసిపోతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News January 13, 2026
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<


