News January 23, 2025

విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు

image

విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు. 

Similar News

News April 23, 2025

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

image

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.

News April 23, 2025

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

image

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పాట్ సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.

News April 23, 2025

పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!