News January 23, 2025

కొమురవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

DCM, బైక్‌ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయలైన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బైక్ మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 13, 2026

వేసవిలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి: ASF కలెక్టర్

image

వచ్చే వేసవిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్ ఇంజినీరింగ్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు. వేసవిలో నిరంతర తాగునీటి సరఫరా కోసం చేపట్టవలసిన చర్యలపై సమీక్షించారు.

News January 13, 2026

వరంగల్: అవుట్‌సోర్సింగ్ నుంచి ప్రభుత్వ కొలువుకు!

image

ఎంజీఎం, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులు ప్రభుత్వ కొలువులు సాధించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన పరీక్షలో వీరు ఉత్తీర్ణత సాధించి ల్యాబ్ టెక్నీషియన్ Gr-IIగా ఎంపికయ్యారు. వీరికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ఆసుపత్రులు, కళాశాలల్లో పోస్టింగ్స్ ఇస్తూ మంగళవారం ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.

News January 13, 2026

రైల్వేకు రూ.1.3 లక్షల కోట్లు!.. సేఫ్టీకి ప్రయారిటీ

image

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్‌ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.