News January 23, 2025
నార్నూర్: క్రీడలు ఆడుతూ విద్యార్థి మృతి

నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో క్రీడలు ఆడుతూ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన బన్నీ పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలో పాల్గొన్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీంతో స్పందించిన ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థిని నార్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News July 4, 2025
ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు యువకుల మృతి

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం నెలకొంది. చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో వాగులో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 4, 2025
పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.
News July 4, 2025
విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.