News January 23, 2025

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు: కలెక్టర్

image

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుందని  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 16వ వార్డు సభలో మూడవ రోజు కొనసాగుతోన్న ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అర్హులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

image

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.

News November 11, 2025

కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.

News November 11, 2025

నంద్యాల విద్యార్థినికి వైఎస్ జగన్ రూ.లక్ష ప్రోత్సాహకం

image

SSC-2025లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించిన నంద్యాల విద్యార్థిని షేక్ ఇష్రత్‌ (599/600) మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఆమెను అభినందించి, రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. మహిళలు చదువుకుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదవాలని జగన్ ఇష్రత్‌కు సూచించారు.