News March 18, 2024

NGKL: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

బిజినేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వీపనగండ్ల మండల వాసి బాలకృష్ణ HYD వైపు బైక్‌పై వెళ్తున్నాడు. మరో బైక్‌పై సూర్యాపేట జిల్లాకు చెందిన అజయ్‌, సిద్దార్థ్‌, భరత్‌ ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో సిద్దార్థ్‌ అక్కడిక్కడే మృతిచెందగా గాయపడ్డ మరో ముగ్గురిని నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News April 11, 2025

జడ్చర్ల: గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం దరఖాస్తులు 

image

జడ్చర్ల మండలం మాచారం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కెమిస్ట్రీ- 4, ఫిజిక్స్ 1, హిస్టరీ 1, కామర్స్ 1, తెలుగు 1, ఇంగ్లీష్ లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.

News April 11, 2025

దేవరకద్ర: తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు

image

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. కాగా గురవారం కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

News April 11, 2025

బాలానగర్: బావిలో దూసి మహిళ SUICIDE

image

బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

error: Content is protected !!