News January 23, 2025
మక్తల్: అనుమానాలొద్దు.. అందరికీ పథకాలు: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ వార్డు కమిటీ హాల్ లో 3, 7, 11, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా అమలయ్యే నాలుగు పథకాలపై ప్రజలు అనుమానాలు పెట్టుకోవద్దని, అర్హులైన వారికి పథకాలు అందుతాయన్నారు.
Similar News
News September 18, 2025
ఈనెల 21 నుంచి ప్రైవేట్ డిగ్రీ కళాశాల బంద్

ఈనెల 21 నుంచి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ చేపడుతున్నామని ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి గుర్రాల వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌కు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 16 నెలల నుంచి ఆర్టీఎఫ్ విడుదల చేయలేదన్నారు. ఆర్టీఎఫ్ విడుదల అయ్యే వరకు కళాశాలలు బంద్ చేస్తామన్నారు.
News September 18, 2025
నేడు రాహుల్ గాంధీ ‘స్పెషల్’ ప్రెస్ మీట్

ఇవాళ రాహుల్ గాంధీ ఓ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉ.10 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని తెలిపింది. అయితే ఏ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాలు, హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
News September 18, 2025
2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.