News January 23, 2025

మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి

image

విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో‌ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.

Similar News

News September 21, 2025

ఈ-గ‌వ‌ర‌న్నెన్స్ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలి: కలెక్టర్

image

విశాఖలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో జరగనున్న 28వ జాతీయ ఈ-గ‌వ‌ర‌న్నెన్స్ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలని జాయింట్ సెక్ర‌ట‌రీ స‌రితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్ర‌ట‌రీ కాట‌మ‌నేని భాస్క‌ర్ నిర్దేశించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి స‌మీక్షా నిర్వ‌హించారు. ఎక్క‌డా ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌న్నారు.

News September 21, 2025

నాగావళి ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

విశాఖ మీదుగా సంబల్పూర్ – నాందేడ్ (20809) వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రీ షెడ్యూలు అయింది. సంబల్పూర్‌లో ఆదివారం ఉదయం 10.50 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోని రైల్వే అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

News September 21, 2025

విశాఖలో శొంఠ్యాం కోడి రూ.300

image

మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.