News January 23, 2025

దుబాయ్‌లో మల్యాల వాసి ఉరివేసుకుని ఆత్మహత్య

image

మల్యాల కేంద్రానికి చెందిన బోగ సాయి (25) అనే యువకుడు దుబాయ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం యథావిధిగా పనికి వెళ్లిన సాయి ఈ రోజు వరకు తిరిగి రాకపోవడంతో అతని కంపెనీ వారు వెతకగా.. దుబాయ్‌లోని అల్కుస్ ప్రాంతంలోని హోర్డింగ్ టవర్ కు ఉరి వేసుకున్నట్లు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సాయి 3 నెలల క్రితమే దుబాయ్ వెళ్లి ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 11, 2025

PDPL: 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వానాకాలం 2025 పంటను సజావుగా కొనుగోలు చేయాలంటే, ధాన్యాన్ని 17% తేమ శాతం వరకు ఆరబట్టి, నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సోమవారం సూచించారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు.

News November 11, 2025

ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

image

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.

News November 11, 2025

9 మంది యువకులపై బైండోవర్ కేసులు

image

కదిరిలో గంజాయి తాగుతున్న యువకులపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం వీరిపై బైండ్ ఓవర్ కేసులు నమోదుచేసి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్‌ ఇచ్చామన్నారు. మంగళవారం తహశీల్దార్‌ ముందు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఫైన్ విధించి, బైండ్‌ ఓవర్‌ చేయనున్నట్లు వివరించారు. గంజాయిని వాడే 17 ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.