News January 23, 2025
ట్రంప్ తగ్గేదే లే
అధికారంలోకి వచ్చిన తొలిరోజే US దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.
Similar News
News January 24, 2025
ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ.13 లక్షలు కట్టాల్సిందే
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి చెల్లించాల్సిన ఫీజును నేపాల్ పెంచింది. ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే విదేశీ పర్యాటకులు రూ.13 లక్షలు (15 వేల డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.9.5 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా వచ్చిన డబ్బుతో క్లీన్ అప్ డ్రైవ్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ట్రెక్కింగ్ కార్యక్రమాలకు వినియోగిస్తారు.
News January 24, 2025
విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్?
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు HT పేర్కొంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు తెలిపింది. 2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు. గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు బలం చేకూరుస్తోంది.
News January 24, 2025
భారత్ చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో భారత పర్యటనకు వచ్చారు. 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని భారత్ ఆహ్వానించగా, ఆయన కొద్దిసేపటి కిందటే ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడి రాక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.