News January 23, 2025

సుబేదారి: ఆటో డ్రైవర్ హత్య.. నిందితుడి అరెస్టు

image

సుబేదారిలో నడిరోడ్డుపై దారుణ హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో పాటు హత్యకు గురైన మరో ఆటో డ్రైవర్‌ మాచర్ల రాజ్‌కుమార్‌‌కు మడికొండకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. 

Similar News

News November 5, 2025

133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<>AVNL<<>>) 133 Jr టెక్నీషియన్, Environ.Eng, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, B.Tech, BSc(eng), డిగ్రీ, PG, MBA, PGBDM, ఉత్తీర్ణతతో పాటు NTC/NAC గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News November 5, 2025

చేలో కూలీలతో కలిసి కలుపు తీసిన పల్నాడు జిల్లా కలెక్టర్

image

రాజుపాలెం(M) రాజుపాలెంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. సహజ సిద్ధంగా సాగు చేస్తున్న చామంతి, మిర్చి, బొప్పాయి తోటలను పరిశీలించారు. మిర్చి పంటలో జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి కలుపు తీసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విధానంలో పండిన కూరగాయలను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.

News November 5, 2025

ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని సాలూరు వంద పడకల ఆసుపత్రి.!

image

కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మిస్తున్న సాలూరు వంద పడకల ఆసుపత్రి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ప్రారంభంకు నోచుకోలేదు. వైద్య సేవలు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా వసతుల లేమితో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ చూసేందుకు సరిపడా గదులు లేక ఐదుగురు డాక్టర్లు ఒకేచోట ఉండి సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ మీనాక్షి తెలిపారు. ఆసుపత్రి తొందరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.