News January 23, 2025

ఆర్మూర్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నల్ల పోచమ్మ గల్లీకి చెందిన ఒక యువకుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు కూలి పని చేస్తూ ఉంటాడని స్థానికులు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Similar News

News November 15, 2025

మహిళా PSల డీఎస్పీగా యు.రవిచంద్ర

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా రవి చంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని డీఎస్పీ తెలిపారు. మహిళలు,బాలికల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, మహిళలపై జరిగే నేరాల విషయంలో వేగవంతమైన, పారదర్శకమైన విచారణకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

News November 15, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కఠినంగా ఆదేశించారు. శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

News November 15, 2025

DRDOలో 18 అప్రెంటిస్‌లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>DRDO<<>> అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ సెంటర్, హల్ద్వానీలో 18 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. 18ఏళ్లు నిండిన ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/