News January 23, 2025

PDPL: ఫిబ్రవరి 1లోగా గురుకుల ప్రవేశాల దరఖాస్తు సమర్పించాలి: RDO

image

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య పేర్కొన్నారు. గురువారం గురుకుల అధికారులతో RDO సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను తహశీల్దారులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్ 18005985459 ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

BREAKING: MNCL: బాల్కసుమన్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

image

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌ విచారణను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఈనెల 26కు వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, సుమన్‌ తరఫు న్యాయవాదుల ప్రతివాదనలు విన్న తర్వాత విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News February 24, 2026

సూర్యోదయ తిథి ఆధారంగా పండుగలు ఎందుకు?

image

హిందూ క్యాలెండర్ ప్రకారం పండుగలు, ఉపవాసాలు తిథులపై ఆధారపడి ఉంటాయి. తిథి అనేది సూర్యచంద్రుల గమనాన్ని బట్టి మారుతుంటుంది. అందుకే ఇది ఇంగ్లీష్ తేదీలలా 24 గంటలు స్థిరంగా ఉండదు. అయితే సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా అదే తిథిగా పరిగణిస్తారు. పగలు జరుపుకొనే పండుగలను ఆరోజే నిర్వహిస్తారు. రాత్రిపూట జరుపుకొనే పండుగలకు మాత్రం ఆయా సమయాల్లో ఉన్న తిథిని బట్టి జరుపుతారు.

News February 24, 2026

HYD: 3 కార్పొరేషన్ల వెబ్ సైట్లు ఇవే!

image

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT