News January 23, 2025
డిచ్పల్లి: బైక్ చోరీ.. నిందితుడి అరెస్ట్

బైక్ చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు గురువారం డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ధర్మారం(బీ) లో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగుడు చోరీ చేశాడు. బాధితుడు సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిచ్పల్లిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బిచ్కుందకు చెందిన మంగళి దత్తు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించి, నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News January 28, 2026
NZB:మున్సిపోల్స్.. కౌన్సిలర్ టికెట్ల కోసం వెంపర్లాట

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News January 28, 2026
నిజామాబాద్: 108లో ఉద్యోగాలు

108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT)గా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ తెలిపారు. NZB జిల్లాలో 20 పోస్టులకు BSC(BZC), BSC నర్సింగ్, GNM, DMLT చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో NZB జిల్లా ఆసుపత్రిలో బుధ, గురువారాలు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9100799106కు సంప్రదించాలన్నారు.
News January 28, 2026
NZB: కార్పొరేషన్ ఎన్నికల్లో CPI (ML) న్యూడెమోక్రసీ పోటీ

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో CPI (ML) న్యూడెమోక్రసీ పోటీ చేస్తున్నట్లు నగర కార్యదర్శి నీలం సాయిబాబా ప్రకటించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 7వ డివిజన్లో ఆకుల పాపన్న, 24వ డివిజన్లో ఆకుల అరుణ లు పోటీలో ఉంటారని తెలిపారు. డివిజన్ ప్రజలు మున్సిపాలిటీ పాలక వర్గంలో ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. శివకుమార్, రమేష్, మోహన్, జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


