News January 23, 2025
భద్రాద్రి: పేరెంట్స్ మందలించారని కుమారుడి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన వసంత రెడ్డి(22) ఇంటి వద్ద ఉంటున్నాడు. ఏదైనా పని చేయమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News November 14, 2025
అమృతం యాప్ పనితీరుపై అధికారులకు శిక్షణ

RGM మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులకు ట్యాబ్‌లు అందజేశారు. సాంకేతిక సహకారంతో JIO ట్యాగింగ్, సర్వేల నమోదు, సమస్యల పరిశీలన వంటి పనులు వేగవంతమవుతాయని కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలు ప్రత్యక్షంగా లేదా ఫోన్ ద్వారా వార్డు అధికారులకు తెలియజేయాలని సూచించారు. నల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్‌లో నమోదు చేసే విధానంపై అధికారులు శిక్షణ పొందారు. సమావేశంలో గురువీర, రామన్ తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
బాలల దినోత్సవం.. వరంగల్ పోలీసుల సందేశం

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీసులు పిల్లల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. సైబర్ ముప్పులు, వేధింపుల నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతి పౌరుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు రక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు.
News November 14, 2025
ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్‌లో ఉంది.


