News January 23, 2025

సంగారెడ్డి: ‘రిపబ్లిక్‌డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి’

image

ఈనెల 26న జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే రిపబ్లిక్‌డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలలో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Similar News

News November 7, 2025

గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

image

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.

News November 7, 2025

ఆదిలాబాద్: పార్శిల్ డెలివరీ అంటూ ఏం చేశారంటే..!

image

సైబర్ నేరగాళ్ల వలలో మరో వ్యక్తి మోసపోయాడు. పార్శిల్ డెలివరీలో ఇబ్బందులు ఉన్నాయంటూ వచ్చిన మెసేజ్ కారణంగా బాధితుడు రూ.46,408 పోగొట్టుకున్నాడు. వన్ టౌన్ CI సునీల్ వివరాల మేరకు.. శాంతినగర్ కు చెందిన బిలాల్ కు ఇండియా పోస్టు డెలివరీ యువర్ పార్సెల్ వాజ్ అన్సక్సెస్ఫుల్ డ్యూ టూ ఇన్కరెక్ట్ అడ్రస్ అనే సాధారణ మెసేజ్ వచ్చింది. వెబ్ సైట్ లో అతను అప్డేట్ చేయగా డబ్బులు పోగొట్టుకున్నాడు. శుక్రవారం ఫిర్యాదు చేశాడు.

News November 7, 2025

రామగుండం కమిషనరేట్‌లో వందేమాతరం గీతాలాపన

image

రామగుండం కమిషనరేట్‌లో వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ హాజరై అధికారులు, సిబ్బందితో కలిసి గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ ప్రతాప్‌తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.