News January 23, 2025

ములుగు జిల్లాలో గ్రామ సభల గ్రీవెన్స్ అప్డేట్

image

ములుగు జిల్లాలోని 9 మండలాల్లో గురువారం వరకు గ్రీవెన్స్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులు వివరాలను అధికారులు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులకు 9455, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 6,823, రైతు భరోసాకు 627, ఇందిరమ్మ ఇండ్లకు 9842, గ్రీవెన్స్ దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో శుక్రవారం కూడా గ్రామ సభలు జరగనున్నాయి.

Similar News

News March 12, 2026

మక్తల్ చెరువు కట్ట వద్ద ఘోర ప్రమాదం

image

మక్తల్ చెరువు కట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్తల్ నుంచి బయలుదేరిన జీపును హైదరాబాద్‌ నుంచి వస్తున్న కర్ణాటక వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దండు గ్రామానికి చెందిన జీప్ డ్రైవర్ చిన్నారెడ్డి మృతి చెందినట్లు సమాచారం. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రాలేదు.

News March 12, 2026

భద్రాద్రిలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 490 మంది గైర్హాజరు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 37 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 9,150 మంది విద్యార్థులకు గాను 8,660 మంది హాజరయ్యారని, 490 మంది గైర్హాజరయ్యారని జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగాయని పేర్కొన్నారు.

News March 12, 2026

ఏదులాపురం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

image

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.