News January 23, 2025
తిరుమలలో ముగిసిన అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. 25 రోజులుగా శ్రీవారి శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు.
Similar News
News January 24, 2025
చిత్తూరు: కొత్త దంపతులకు ఊహించని పెళ్లి కానుక
స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు బహుమతిగా విలువైన వస్తువులు ఇస్తుంటాం. కానీ చిత్తూరులో ఓ జంటకు అందిన బహుమతికి అందరూ ఆశ్చర్యపోయారు. నగరంలో జరిగిన ఓ పెళ్లికి ట్రాఫిక్ CI నిత్యబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన దంపతులకు బైకు హెల్మెట్‌ను బహూకరించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అప్పుడే మనతోపాటూ మనల్నే నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటారన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.
News January 24, 2025
తిరుపతిలో అమానుష ఘటన
తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News January 24, 2025
తిరుపతి: ఫిబ్రవరి 3 నుంచి పరీక్షల ప్రారంభం
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. డిగ్రీ తృతీయ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మూడో తేదీ, మొదటి సంవత్సరం పరీక్షలు 14వ తేదీ నుంచి ప్రారంభమం అవుతాయి. అభ్యర్థులు ఇతర వివరాలకు www.svudde.in వెబ్సైట్ చూడాలని సూచించారు.