News January 24, 2025
స్వియాటెక్‌కు షాక్.. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్

టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. రెండో సీడ్ స్వియాటెక్‌కు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కేస్ షాకిచ్చారు. సెమీఫైనల్ మ్యాచులో 5-7, 6-1, 7-6 తేడాతో కేస్ గెలుపొందారు. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో సబలంక 6-4, 6-2 తేడాతో బడోసాపై విజయం సాధించారు. ఎల్లుండి జరిగే ఫైనల్లో కేస్, సబలంక తలపడనున్నారు. మరోవైపు రేపు మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో జకోవిచ్ రెండో సీడ్ జ్వెరెవ్‌తో అమీ తుమీ తేల్చుకోనున్నారు.
Similar News
News November 5, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, బాల్‌వాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈ నెల 25లోగా అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsvizagnsb.nesnavy.in/
News November 5, 2025
యంత్రాలతో వరి కోత.. లాభమేంటి?

కూలీల కొరత, ఎక్కువ ఖర్చు, వేగంగా పంటకోత చేపట్టాలనే ఉద్దేశంతో నేడు చాలా మంది రైతులు యంత్రాల సాయంతో వరి కోతలు చేపడుతున్నారు. దీని వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. యంత్రాలతో కోత, నూర్పిడి చేస్తే చెత్త, దుమ్ము, మట్టిబెడ్డలు వంటివి ధాన్యంలో తగ్గుతాయి. రైతులకు శ్రమ కూడా తగ్గుతుంది. అయితే కంబైన్ హర్వెస్టర్ వంటి కోత యంత్రాలతో కోసేటప్పుడు రెండు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా రైతులు జాగ్రత్త పడాలి.
News November 5, 2025
పోస్టల్ సేవలు ఇక యాప్‌లో..

పోస్టల్ సేవలను వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు డాక్ సేవ(Dak Sewa) యాప్‌ను తపాలా శాఖ తీసుకొచ్చింది. పార్సిల్ ట్రాకింగ్, పోస్టేజ్ కాలిక్యులేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ స్పీడ్/రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్, ట్రాకింగ్ సేవలనూ పొందవచ్చు. అలాగే దగ్గర్లోని పోస్టాఫీసుల వివరాలనూ తెలుసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నంబర్/ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవచ్చు.


