News January 24, 2025

BDR: భౌగోళిక ప్రదేశం అనుకూలంగా ఉంది: AAI

image

కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు సర్వేకు వచ్చిన AAI బృందంతో ఎంపీ రఘురామరెడ్డి, కలెక్టర్ జితేష్‌ వి పాటిల్, ఎమ్మెల్యే సాంబశివరావు కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి వారికి వివరించారు. సింగరేణి, కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, భద్రాద్రి పుణ్యక్షేత్రం ఉందని చెప్పారు. రామవరం భౌగోళిక ప్రదేశం అనుకూలంగా ఉందని AAI బృందం వెల్లడించింది.

Similar News

News January 18, 2026

బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

image

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

News January 18, 2026

T20 WC టీమ్‌లో ప్లేస్ మిస్.. స్పందించిన సిరాజ్

image

T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి మౌనం వీడారు. ‘నేను గత T20 ప్రపంచకప్‌లో ఆడాను. ఈసారి ఆడటం లేదు. ఒక ప్లేయర్‌కు ప్రపంచకప్‌లో ఆడటం అనేది ఒక కల. దేశం కోసం ఆడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగుంది. మంచి ఫామ్‌లో ఉంది. వారికి నా విషెస్. ట్రోఫీ గెలవాలి’ అని అన్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ లేకపోవడంపై వర్క్‌లోడ్ మ్యానేజ్‌మెంటే కారణమని వివరించారు.

News January 18, 2026

మంచిర్యాల: రేపటి ‘ప్రజావాణి’ రద్దు

image

మున్సిపల్ ఎన్నికల విధులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పరిపాలనా పరమైన పనుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.